ఇదే నిజం, బొల్లారం: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో బుధవారం ఉదయం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నిరసన బాట పట్టారు. గత మూడు నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వట్లేదు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు జీతాలు చెల్లించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు సంతోషి మాట్లాడుతూ. గత మూడలను నుంచి తమకు జీతాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె వాపోయారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.