Homeజాతీయం#Terrorism #Panjab #Bomb : భారీ ఉగ్రకుట్న భగ్నం

#Terrorism #Panjab #Bomb : భారీ ఉగ్రకుట్న భగ్నం

పంజాబ్‌లో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు.

అమృత్‌సర్‌లోని దాలిక్‌ గ్రామంలో టిఫిన్‌ బాక్సులో ఉన్న ఐఈడీతో పాటు హ్యాండ్‌ గ్రనేడ్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలను పంజాబ్‌ డీజీపీ దినకర్‌ గుప్తా సోమవారం తెలిపారు.

పేలుడు పదార్థాలు పాక్‌ నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్‌ ద్వారా తరలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే, శని, ఆదివారాల్లో ఆ ప్రాంతంలో డ్రోన్‌లు సంచరించాయని తెలిపారు.

ఈ సమయంలో ఓ బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని తెలిపారు.

దాన్ని తెరిచి చూడగా.. టిఫిన్‌ బాక్స్‌, ఐదు హ్యాండ్‌ గ్రనేడ్‌, డిటోనేటర్లు ఉన్నాయని, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు.

అలాగే రెండు కిలోల బరువున్న ఆర్‌డీఎక్స్‌, ఒక స్విచ్‌, రిమోట్‌ కంట్రోల్‌ను గుర్తించారన్నారు.

డ్రోన్ల శబ్దాలను స్థానిక సర్పంచ్‌ పోలీసులకు సమాచారస్తే.. తాము ఎన్‌ఎస్‌జీ చేరవేసినట్లు తెలిపారు.

దీనిపై ఎన్‌ఎస్‌జీ దర్యాప్తు చేస్తోందన్నారు. పేలుడు పదార్థాలు ఆత్యాధుకమైనవని.. వాటితో పేలుడు సంభవిస్తే భారీ విధ్వంసం జరిగి ఉండేదన్నారు.

గత రెండు, మూడు నెలల్లో సరిహద్దుల నుంచి కార్యకలాపాలు పెరిగాయని డీజీపీ చెప్పారు.

వాటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. పిల్లలు, అమాయక వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు.

ప్రజలు ప్రయాణ సమయంలో బస్సులు, ఇతర వాహనాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img