Homeసినిమాసీక్రెట్స్ బయటపెట్టిన‌ పరిణితి చోప్రా

సీక్రెట్స్ బయటపెట్టిన‌ పరిణితి చోప్రా

ParineetiChopra has revealed that he loved Saif Ali Khan as a child and kissed someone when he was 18 years old. The beauty said that she has never gone on a date with anyone.

హీరో హీరోయిన్లకు లవ్ ఎఫైర్స్, డేటింగ్స్ అనేవి కామనే అని అనుకుంటాం.

మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కల్చర్ చాలా ఎక్కువ. కానీ తాను మాత్రం ఎప్పుడూ డేట్‌కి వెళ్లలేదని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా.

ఆమె లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది పరిణితి.

‘డూ యూ రిమెంబర్‌’ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆమె.. తన తొలిముద్దు అనుభవాన్ని పేర్కొంటూ ఓపెన్ అయింది.

చిన్నతనంలో ఉన్నప్పుడు సైఫ్‌ అలీఖాన్‌ను తాను ఎంతగానో ప్రేమించానని, తనకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరిని ముద్దు పెట్టుకున్నానని.. అయితే అదే తన తొలిముద్దు పరిణితి చోప్రా వెల్లడించింది.

ఇకపోతే తాను ఎప్పుడూ, ఎవ్వరితో డేట్‌కి వెళ్లలేదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

తాను హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబాల్‌’ విడుదలైన తర్వాత ఓ అభిమాని నుంచి ఓ పుస్తకం స్పెషల్‌ గిఫ్ట్‌గా వచ్చిందని, అన్నీ లేఖలే ఉన్న ఆ పుస్తకం తనకెంతో ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొంది.

పరిణితి చోప్రా నటించిన ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ మూవీ రిభూ దాస్‌ గుప్తా దర్శకత్వంలో రూపొందింది.

రిలయన్స్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ పతాకంపై చిత్రీకరించిన ఈ మూవీని ఇటీవలే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై రిలీజ్ చేశారు.

దీంతో పాటు పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పరిణితి చోప్రా.. భారత బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.

‘సైనా’ అనే పేరుతో రాబోతున్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా బ్యాట్మింటన్‌లో శిక్షణ తీసుకుంది పరిణితి.

Recent

- Advertisment -spot_img