Homeఅంతర్జాతీయంPigs as gifts : ఈ స్కూల్‌లో స్టూడెంట్స్‌కు పందులే బ‌హుమ‌తిగా ఇస్తారు.. ఎందుకో తెలుసా..

Pigs as gifts : ఈ స్కూల్‌లో స్టూడెంట్స్‌కు పందులే బ‌హుమ‌తిగా ఇస్తారు.. ఎందుకో తెలుసా..

Pigs as gifts : ఈ స్కూల్‌లో స్టూడెంట్స్‌కు పందులే బ‌హుమ‌తిగా ఇస్తారు.. ఎందుకో తెలుసా..

Pigs as gifts : చైనాలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు పందులను బహుమతిగా ఇస్తున్నారు.

వాటితో వ్యాపారం చేయమంటున్నారు. చదువుకోవాల్సినవారికి పందులను బహుమతిగా ఎందుకు ఇస్తున్నారంటే..?

సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే మెడల్స్‌, పుస్తకాలు, చదువుకు ఉపయోగపడే ఇతర వస్తువుల్ని బహుమతిగా ఇస్తుంటారు.

కానీ, చైనాలోని ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పందుల్ని బహుమతిగా ఇస్తోంది.

దీని వెనుక గ్రామీణ వాణిజ్యంలో వృద్ధి సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యముందని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.

యునాన్‌ ప్రావిన్స్‌ ఇలియాంగ్‌ ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 20 మంది విద్యార్థులకు పందుల్ని బహుమతిగా ఇస్తున్న వీడియో చైనీస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

China : చైనాలో జనాభా సంక్షోభం.. పుట్టుక‌లు త‌క్కువ‌.. ముస‌లోళ్ళు ఎక్కువ‌

Afghanistan Poverty : ఆకలి తీర్చుకోవడానికి అవయవాల విక్రయం

దీనిపై స్పందించిన ఆ పాఠశాల యాజమాన్యం “గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వారిలో కష్టపడుతూ చదువుకుంటున్న ప్రతిభ గల విద్యార్థులకు పందుల్ని బహుమతిగా ఇస్తూ వారికి, వారి కుటుంబాలకు చేయూతని అందిస్తున్నాం.

వీటి ద్వారా వెంటనే లాభాలు రాకపోవచ్చు. కానీ, వీటి పెంపకంతో భవిష్యత్తులో లాభాలు గడించొచ్చు.

పందుల పెంపకం వ్యాపారం చేయొచ్చు. లేదా ఆ పందిని కొంతకాలం పెంచి విక్రయించుకోవచ్చు.

ఆ డబ్బుతో చిన్నారుల చదువుకు అవసరమయ్యే పుస్తకాలు, వస్తువుల్ని తల్లిదండ్రులు కొనుగోలు చేస్తారు.

మార్కెట్‌లో లావాదేవీలు జరుగుతాయి. విద్యార్థులు కూడా బహుమతి దక్కించుకోవాలని మరింత బాగా చదువుతారు.

ఇలా గ్రామీణ ప్రాంతాల్లో చదువు, వాణిజ్యం రెండు అభివృద్ధి చెందుతాయి” అని ఉపాధ్యాయులు తెలిపారు. భలే వింతయినా, తెలివైనా ఆలోచన కదా..!

Visa : శక్తిమంతమైన పాస్ పోర్ట్ జాబితాలో భారత్.. వీసా లేకుండా 60 దేశాలకు

Divorce : నచ్చని పాటకు డ్యాన్స్ చేసింద‌ని పెళ్లిరోజే విడాకులిచ్చిన వరుడు

Heart Transplant : పంది గుండెను మ‌నిషికి అమ‌ర్చిన‌ అమెరికా డాక్ట‌ర్లు

Recent

- Advertisment -spot_img