ఇదేనిజం, శేరిలింగంపల్లి: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న హుక్కా సెంటర్ పై యస్ఓటీ పోలీసులు రైడ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆపై సరుకును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎల్ఎఫ్ రోడ్డులోగల క్లౌడ్ 9 హుక్కా సెంటర్ పై గచ్చిబౌలి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హానికరమైన ఫ్లేవర్స్ ను ఉపయోగించి కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యజమాని రమేశ్, బలరామ్ శశికుమార్ లను అరెస్టు చేశారు. హుక్కా ఫ్లేవర్స్, పాట్స్, పైప్స్ స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.