HomeసినిమాRadheShyam : రాధేశ్యామ్ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డా

RadheShyam : రాధేశ్యామ్ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డా

RadheShyam : రాధేశ్యామ్ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డా

RadheShyam : ప్రభాస్‌-పూజాహెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది.

అయితే, దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

“విభిన్న ప్రేమకథా చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ‘రాధేశ్యామ్‌’తో నా కల నెరవేరింది”

“ఈ చిత్రంలో ‘ప్రేరణ’గా నటించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇందులో కథానాయిక పాత్ర అద్భుతంగా ఉంటుంది”

“నాకు తెలిసినంతవరకూ ఇప్పటి వరకూ నేను చేసిన చిత్రాల్లో ‘రాధేశ్యామ్‌’ క్లిష్టమైనది”

“ఇది ఒక పీరియాడికల్‌ చిత్రం కావడం వల్ల ‘ప్రేరణ’ పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతో రీసెర్చ్ చేశా”

“ఈ లవ్‌ మేజిక్‌ని వెండితెరపై చూసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా”- పూజా

ప్రేమ-విధికి మధ్య జరిగే సంఘర్షణ ఆధారంగా చేసుకుని ‘రాధేశ్యామ్‌’ రూపుదిద్దుకుంది.

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మూడోవేవ్‌ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం విడుదల ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img