రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్ ’ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు బ్రేక్ అయ్యే కలెక్షన్లు రాబట్టాడు. ఇక ఏదైనా సినిమాలో తన పాత్ర కోసం కష్టపడేవారిలో ప్రభాస్ ముందుంటాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ వంద కోట్ల మార్క్‌కు చేరుకున్నది. అయితే బాహుబలి సమయంలో ప్రభాస్ మోకాలి సమస్యతో బాధపడ్డాడు. నొప్పి తీవ్రత పెరగడంతో గత ఏడాది విదేశాలలో సర్జరీ చేయించుకున్నాడు డార్లింగ్. ఒక నెల రోజుల పాటు అక్కడే విశ్రాంతి కూడా తీసుకున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టిందట. సలార్ సినిమాలో ఆ గాయం మరింత పెరిగి ప్రస్తుతం పరిస్థితి తీవ్రం ఐనట్టు తెలుస్తుంది. ఇక డాక్టర్లు దీనిని చూసి మరోసారి సర్జరీ చేయాలంటున్నారట. ఇక ప్రభాస్ దీనిపై తమ ఫ్యాన్స్ కి ఎటువంటి సమాచారం బైటపెట్టకున్న ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని ఆందోళన చెందుతున్నారు.