సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప-2’కు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పుష్ప-2 బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 గా ఖరారు చేసింది. అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతిచ్చింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.150, మల్టీఫ్లెక్స్లో రూ.200 పెంపునకు పర్మిషన్ ఇచ్చింది.