Homeహైదరాబాద్latest NewsPushpa 2 The Rule: పుష్ప-2 స్పెషల్‌ సాంగ్‌ కోసం "యానిమల్" బ్యూటీ..!

Pushpa 2 The Rule: పుష్ప-2 స్పెషల్‌ సాంగ్‌ కోసం “యానిమల్” బ్యూటీ..!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరగగా, ఈ సాంగ్ కోసం తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. పుష్ప 2లో త్రిప్తీ దిమ్రీ ఓ పాటలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీకి జోడీగా ఆమె స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాలీవుడ్ సమాచారం. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, రావు రమేష్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img