Pushpa Item Song singer : పుష్ప ఐటమ్ సాంగ్ సింగర్ ఎవరో తెలుసా..
Pushpa Item Song singer – పుష్ప చిత్రంలో Samantha స్పెషల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.
సమంత తొలిసారి స్పెషల్ సాంగ్ చేస్తుండడంతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఇప్పటికే పుష్ప చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
సమంత స్పెషల్ సాంగ్ తో ఆ అంచనాలు మరో స్థాయికి చేరాయి.
ఆడవారి పట్ల మగవాళ్ల వైఖరిని మత్తుగా వివరిస్తూ చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించారు.
మాస్ ప్రేక్షకులు ఈ సాంగ్ ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
కొందరు మాత్రం ఈ సాంగ్ లో లిరిక్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా సమంత స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
సమంత గ్లామర్, దేవిశ్రీ సంగీతం ఒక ఎత్తైతే.. ఈ పాటని పాడిన ఇంద్రావతి చౌహన్ తన మత్తు వాయిస్ తో నెక్స్ట్ లెవల్ కి చేర్చింది.
దీనితో ఇంద్రావతి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
ఆమె బయోడేటా గురించి గూగుల్ లో సెర్చింగ్ మొదలు పెట్టారు.
ఇంద్రావతి ఎవరో కాదు.. టాలీవుడ్ ఫేమస్ జానపద గాయని మంగ్లీకి స్వయానా చెల్లెలు.
ఇప్పుడిప్పుడే ఇంద్రావతి టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది.
ఈమె కూడా జానపద పాటలు పాడుతుంది.
ఇంద్రావతి జార్జి రెడ్డి చిత్రంలో జాజి మొగులాలి అనే పాటని పాడింది.
అదే చిత్రంలో మంగ్లీ పాడిన ‘వాడు నడిపే బండి’ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
సంగీత దర్శకుడు కోటి జడ్జిగా వ్యవహరించిన ‘బోల్ బేబీ బోల్’ షోలో కూడా ఇంద్రావతి పాల్గొంది.
పుష్ప చిత్రంలోని స్పెషల్ సాంగ్ ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు.
‘ఊ అంటావా మావ ఊ ఊ అంటావా’ అంటూ మత్తు వాయిస్ తో ఇంద్రావతి మ్యాజిక్ చేస్తోంది.
ఇదే పాటని కన్నడలో మంగ్లీ పాడడం విశేషం.
Pushpa చిత్రం డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులని విశేషంగాఆకట్టుకుంటోంది.
సుకుమార్ ఈ చిత్రాన్ని ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారు. బన్నీకి జోడిగా రష్మిక నటించింది.
ఇవి కూడా చదవండి
ఊ అంటారా… దేవీ శ్రీ ప్రసాద్ కాపీ కొట్టారా