డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”(Pushpa2TheRule). ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి ‘సూసేకి’ సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ఈ పాట నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. తాజాగా యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్, 1.67 మిలియన్లకుపైగా లైక్స్‌తో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది.