ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప– 2’. సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప–2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. పుష్ప–1లో 1990ల నాటి కాలాన్ని చూపించిన సుకుమార్ సెకండ్ పార్ట్‌లో 2000వ సంవత్సరానికి మార్చినట్లు తెలుస్తోంది . అయితే, సెకండ్ పార్ట్‌లో పుష్పరాజ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్‌గా కనిపించనున్నాడు. ఇపుడు అవే సీన్స్‌ను తెరకెక్కిస్తునున్నట్లు సమాచారం. ‘ఇంద్ర’ రిలీజ్ టైమ్‌ను పుష్ప–2లో చూపించనున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్‌లోనూ మెగాస్టార్‌కు వీరాభిమాని అయిన బన్నీ.. ఆఫ్ స్క్రీన్‌లో ఆయన ఫ్యాన్‌గానే కనిపించనున్నాడు. పుష్పరాజ్ మెగా ఫ్యాన్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయానికి సంబంధించి మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పుష్ప–2 ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది.