Homeబిజినెస్‌Rakesh jhunjhunwala : ఒకే రోజులో రూ. 861 కోట్లు సంపద‌

Rakesh jhunjhunwala : ఒకే రోజులో రూ. 861 కోట్లు సంపద‌

Rakesh jhunjhunwala : ఒకే రోజులో రూ. 861 కోట్లు సంపద‌

Rakesh jhunjhunwala : ఒక్క రోజులో మీరు ఎంత సంపాదిస్తారు ? రూ .100 లేదా రూ. 500 మరింత అయితే.. రూ. 1000, ఇంకా అయితే.. రూ. 10 వేలు అంతేకదా.

అదే ధనవంతుల విషయానికి వస్తే.. ఇది తేడగా ఉంటుంది. వారి రోజు సంపాదన లక్షల్లోనే ఉంటుంది.

లక్షలు, కోట్లు సంపాదిస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఓ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కోట్ల సంపదను ఎవరైనా సృష్టంచగలరా అంటే.. అందరి చూపు ఆయన వైపు వెళుతుంది.

కొన్ని గంటల వ్యవధిలో కోట్లు గడిస్తుంటారు. ఆయనే ఇండియన్ బిగ్ బుల్ గా పేరొందిన ‘రాకేశ్ ఝున్ ఝున్ వాలా’.

తాజాగా ఏకంగా రూ. 861 కోట్లు సంపాదించి తన సత్తా ఏంటో చూపించారు.

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా చేయ‌డం ఎలా..?

Post Office Scheme : పోస్టాఫీస్‌లో ఇలా నెల‌కు రూ.4,950 ఆదాయం

ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతిపెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెని, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్చి 17వ తేదీ శనివారం ట్రేడింగ్ లో మెరిసిపోయింది.

టైటాన్ కు సంబంధించిన షేర్లు ఒక్కసారిగా రూ. 2 వేల 587 నుంచి రూ. 2 వేల 706కి ఎగబాకాయి.

ప్రతి షేర్ విలువ రూ. 118.70 పెరిగింది. స్టార్ హెల్త్ షేరు ధర రూ. 608. 80 నుంచి రూ. 641కి పెరిగింది.

అంటే షేరు ధర రూ. 32.20కి పెరిగింది. అంటే స్టార్ హెల్త్ షేర్ పెరగడం వల్ల ఆయన నికర సంపద సుమారు రూ. 324 కట్లు.

టైటాన్ షేర్ ధర, స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడం వల్ల నికర విలువ పెరుగుదల రూ. 861 కోట్లు.

Financial Security : హైదరాబాద్ లో ఆర్థిక భద్రత తక్కువే!.. మెట్రో నగరాలపై తాజా సర్వే

Curd : పెరుగుతో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తింటే అనేక లాభాలు

టైటాన్ షేర్ హోల్డింగ్ ప్రకారం…రాకేష్ ఝున్ ఝున్ వాలా, ఆయన సతీమణి రేఖా ఝున్ ఝున్ వాలాకు కంపెనీలో వాటా ఉంది.

3,57,10,395 షేర్లు ఝున్ ఝున్ వాలా, రేఖా ఝున్ ఝున్ వాలాకు 95,40,575 షేర్లు కలిగి ఉన్నారు.

వీరిద్దరూ కలిపి 4,52,50,970 షేర్లు (5.09) కలిగి ఉన్నారు.

4,52,50,970 టైటాన్ షేర్లు కలిగి ఉన్న ఝున్ ఝున్ వాలా నికర పెరుగుదలలో సుమారు రూ. 537 కోట్లు, 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లను కలిగి ఉన్నారు.

వీటి షేర్ల ధరలు పెరగడం వల్ల ఒక్కరోజులోనే రూ. 861 కోట్లు సంపాదించారు ఝున్ ఝున్ వాలా.

Morning Food : ఉద‌యాన్నే వీటిని తింటే రోజంతా ఉత్సాహం

Before Death : మ‌నిషి చ‌నిపోవ‌డానికి ముందు ఏమౌతుంది

Recent

- Advertisment -spot_img