రకుల్ ప్రీతిసింగ్ కి సినిమా అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ రకుల్ కి క్రేజ్ తగ్గలేదు. రకుల్ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో చాలా కాలం నుంచ ప్రేమలో ఉంది. తమ రిలేషన్ షిప్ ను సోషల్ మీడియా వేదికగా వీరు ప్రకటించారు. కొన్ని రోజుల్లో వీరు పెళ్లి చేసుకుని, దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నెల 21న వీరి వివాహం గోవాలో జరగబోతోంది. ఈ క్రమంలో తమ స్నేహితులకు వీరు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. థాయ్ లాండ్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ అటెండ్ అయ్యారు.