Rakul Preet Singh : తమిల్‌లో స్టార్ హీరోతో రకుల్ సినిమా
Rakul Preet Singh : తెలుగు, తమిళం, హిందీ..ఇలా అన్ని భాషల్లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).
ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది.
ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.
రీసెంట్‌గా వలిమై సినిమాతో మంచి హిట్టు కొట్టాడు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar).
ఈ క్రేజీ యాక్టర్ హెచ్ వినోథ్ (H Vinoth) డైరెక్షన్‌లో ఏకే 61 (AK 61) మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లో కొనసాగుతుంది.
ఏకే 61లో రకుల్ ప్రీత్ సింగ్ ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Swasthik symbol : హిట్లర్ తన పార్టీ గుర్తుగా హిందూ మత చిహ్నాం స్వస్తిక్‌ను ఎందుకు ఎంచుకున్నారు
మీ ప్రాంతంలో రక్తం దాతల ఫోన్ నెంబర్లు..
అజిత్‌తో రకుల్ రొమాన్స్ చేయబోతుందనే దానిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.
బోనీకపూర్ (Boney Kapoor) ఈ క్రేజీ ప్రాజెక్టును భారీ బడ్జెట్, తారాగణం, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు.
గిబ్రాన్ (Ghibran)మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాకు గొప్ప గొప్ప సాంకేతిక నిపుణుల బృందం పనిచేయనుందట.
రకుల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో 31 October Ladies Night సినిమా చేస్తోంది.
దీంతోపాటు హిందీలో రన్ వే 34, డాక్టర్ జీ, మిషన్ సిండెరెల్లా, థ్యాంక్ గాడ్, అయలాన్, ఛత్రివాలి సినిమాల్లో నటిస్తోంది.
ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
కమల్ హాసన్‌తో చేయాల్సిన బై లింగ్యువల్ ప్రాజెక్టు ఇండియన్ 2 పలు కారణాల వల్ల నిలిచిపోయింది.
Wrong Transaction : డబ్బు తప్పు అకౌంట్ కి వెళ్లిందా.. అయితే ఏమి చేయాలి?
Step wells : ‘పాతాళ ద్వారాలు’ భారతదేశ మెట్ల బావులు..
Rakul Preet Singh