I do not give priority to ‘numbers’. I do not believe in one, two, three positions. If a movie hits, I think it is a real victory. I really want to live, ‘says Rakul Preet Singh.
‘నంబర్స్‌కు నేను ప్రాధాన్యతనివ్వను. వన్, టూ, త్రీ స్థానాలపై నాకు నమ్మకం లేదు. ఓ సినిమా హిట్టయితే అదే నిజమైన గెలుపుగా భావిస్తాను. వాస్తవంలో జీవించడానికే ఇష్టపడతాను’ అంటోది అందాలభామ రకుల్ ప్రీత్‌సింగ్.
‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌లో నాయికగా పరిచయమైన ఈ భామ కెరీర్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయంతో ఊపందుకుంది.
అనతికాలంలోనే టాలీవుడ్‌లో అగ్రనాయికల్లో చేరిన రకుల్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం రేసులో కాస్త వెనుకబడి వుంది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ ‘విజయాలు, అపజయాలు రెండింటిని సమానంగా స్వీకరిస్తాను.
నాకు నేనే పోటీగా భావించుకుంటాను. నాలోని సృజనాత్మకతను సంతృప్తిపరిచే వైవిధ్యమైన పాత్రల్లో నటించాలన్నది నా అభిమతం.
ఇంతకుమించి ఎక్కువగా ఆలోచించను. ఒకవేళ సినిమా పరాజయం పాలైనా బాధపడను.
ఫలితం మన చేతులో ఉండదు.సాధించిన విజయాల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతాను’ అని చెప్పుకొచ్చింది