Idenijam, Webdesk : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైకు చెందిన వేల్స్ విశ్వ విద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13 న జరగనున్న యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కళా రంగానికి విశేష కృషి చేస్తున్నందుకు గాను ఆయన సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై మెగా పవర్‌స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.