Homeక్రైంRape: యువకుడిపై యువతులు అత్యాచారం

Rape: యువకుడిపై యువతులు అత్యాచారం

Rape:జలంధర నగరంలోని కపుర్తలా రోడ్డులో ఓ యువకుడు పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ కారులో వచ్చిన అమ్మాయిలు.. ఆ యువకుడిపై మత్తుమందు చల్లారు. అతడిని కిడ్నాప్​ చేశారు. ఆ తర్వాత ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. పూటుగా మద్యం తాగిన ఆ యువతులు ఆ యువకుడిని కూడా మద్యం తాగాలని బలవంతం చేశారు. అనంతరం అతడిని తాళ్లతో కట్టి, అత్యాచారం చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు అదే కారులో యువకుడిని ఎక్కించుకుని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఉదయం స్పృహ వచ్చాక ఆ యువకుడు తనపై అత్యాచారం జరిగిందని గుర్తించాడు. వెంటనే ఓ వీడియో విడుదల చేశాడు. తనపై అత్యాచారం జరిగిందని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పరువు పోతుందని, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో వైరల్ గా మారడంతో జలంధర్​ డీసీపీ జగన్మోహన్ ​సింగ్ ​స్పందించారు. తమ వద్దకు ఇలాంటి కేసు ఏదీ రాలేదని, ఏ పోలీస్​స్టేషన్​‌లోనూ ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img