కరోనా వ్యాప్తితో చిత్రీకరణలు నిలిచిపోవడంతో విరామ సమయాన్ని ఏకాంతంగా ఆస్వాదిస్తోంది రష్మిక మందన్న.
ఈ గ్యాప్‌లో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది ఈ సుందరి.
‘మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా’?అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘నటనపైనే నా దృష్టంతా ఉంది. ప్రేమించడానికి సమయం లేదు.
హార్డ్‌వర్క్‌నే నా బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్నా’నని రష్మిక బదులిచ్చింది. తాను ఎవరితో డేటింగ్‌లో లేనని చెప్పింది.
‘డేటింగ్‌కు ఎలా వెళ్లాలో నాకు తెలియదు. సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొనడానికి ప్రాముఖ్యతనిస్తా.
వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటా. అదే డేటింగ్‌గా నేను భావిస్తా’ అని పేర్కొన్నది.
విజయ్‌దేవరకొండతో మళ్లీ ఎప్పు డూ సినిమా చేస్తారని అడగ్గా సరైన కథ దొరికితే తప్పకుండా విజయ్‌తో సినిమా చేస్తానని.. ఆ క్షణాల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
షూటింగ్‌లతో పాటు కరోనా వ్యాప్తి కారణంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సివస్తోందని, అమ్మానాన్నల్ని కలిసి ఐదునెలలు దాటిందని రష్మిక చెప్పింది.