పిల్లలు ఏదైనా తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. ఈ వయసులో గ్రహణ శక్తీ ఎక్కువుగా ఉండటం వల్ల పిల్లలు ఏదైనా సరే తొందరగా నేర్చుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ ఇవ్వకండి. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలతో కొంత సమయం వెచ్చించాలి. టీవీ మరియు స్మార్ట్‌ఫోన్‌ల వినియోగానికి స్క్రీన్ టైం విధించాలి. కలి సమయంలో పిల్లలు ఆసక్తి ఉన్న పుస్తకాలు చదవాలి, అలాగే వారితో రకరకాల ఆటలు ఆడాలి. అప్పుడు వారిలో మానసిక వికాసం, మానసిక ఉత్తేజం కలుగుతాయి.