Relief with sinus problem in winter : సైనస్ జలుబు నుంచి ఉపశమనం పొందడం ఎలా..
చలికాలం వచ్చిందంటే చాలు.. సైనస్ సమస్య ఉన్నవారికి ఇబ్బందులు ఇంకా ఎక్కువవుతుంటాయి.
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. తలంతా భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
సైనస్‌లో రెండు రకాలు ఉంటాయి.
అక్యూట్, క్రానిక్ అని 2 రకాల సైనస్‌లు ఉంటాయి.
క్రానిక్ సైనుసైటిస్‌కు యాంటీ బయోటిక్స్‌ను వాడాల్సి ఉంటుంది.
ఆక్యూట్ సైనస్‌కు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు.
డస్ట్ అలర్జీ, కెమికల్స్, కాలుష్య కారకాలు వంటి వాటి వల్ల సైనస్ ఇన్‌ఫెక్షన్ వస్తుంటుంది.
దీంతో నాసికా మార్గాల్లో వాపులు వస్తాయి. ఇన్‌ఫెక్షన్‌లకు గురవుతాయి.
ఈ క్రమంలో తలనొప్పి, ముఖం వాపులు, నొప్పి, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు.. వంటి సమస్యలు వస్తాయి.
సైనస్ సమస్య ఎక్కువగా ఉన్నవారు డాక్టర్ చే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. నీటిని ఎక్కువగా తాగడం వల్ల సైనస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
నీటిని తాగడం వల్ల మ్యూకస్ పలుచ బడుతుంది.
దీంతో నాసికా మార్గాలు క్లియర్ అవుతాయి.
ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది.
అందువల్ల నీటిని బాగా తాగాలి.
2. రోజూ ఉదయం, సాయత్రం వేడి నీటిలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పట్టాలి.
దీంతో చాలా రిలీఫ్ వస్తుంది. నొప్పి తగ్గుతుంది.
3. వేడి వేడి సూప్‌లను తాగడం వల్ల కూడా మ్యూకస్ కరిగిపోతుంది.
దీంతో సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. సైనస్ నుంచి ఉపశమనాన్ని అందించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది.
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి తాగాలి. సమస్య తగ్గుతుంది.
5. ఒక కప్పు నీటిలో పావు టీస్పూన్ పసుపు వేసి బాగా మరిగించి డికాషన్ లా కాచి తాగుతుండాలి.
రోజుకు రెండు సార్లు ఇలా తాగితే సైనస్ తగ్గుతుంది.
6. నీళ్లను బాగా మరిగించి అందులో తురిమిన అల్లం వేయాలి.
7 నిమిషాల పాటు అలాగే ఉంచాక వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తాగాలి.
ఈ విధంగా రోజుకు రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
7. కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొంత దాల్చిన చెక్క పొడి వేసి కలిపి పేస్ట్‌లా చేయాలి.
అనంతరం దాన్ని ముక్కుపై రాయాలి. దీంతో శ్లేష్మం కరుగుతుంది.
నాసికా మార్గాలు క్లియర్ అవుతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది. సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.