RythuBandhu : ఆ రోజు నుంచే రైతులకు రైతుబంధు నగదు బదిలీ..
RythuBandhu – యాసంగిలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అయితే రైతులకు ఎప్పటిలాగే రైతుబంధు డబ్బులు అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఇప్పుడు వారికి ఆ నిధులు పంపిణీ చేసే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు.
రైతుబంధు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
దీంతో ఇందుకోసం వెచ్చించే రూ. 7500 కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
డిసెంబర్ 15 నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ కావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో.. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గత వానాకాలం సీజన్‌లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి రైతుబంధు నగదును ఖాతాల్లోకి బదిలీ చేశారు.
ఈసారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
గత వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఈ యాసంగి సీజన్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరగనుంది.
ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరముంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నాయా..