సాగులో ఉన్న భూములకే రైతు బంధు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. రైతు బంధు అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొందరు అధికారులు అత్యుత్సాహం చూపుతూ తన కుటుంబ సభ్యులను నేరుగా కలుస్తున్నానని ఇది మంచి పద్ధతి కాదని ఫైర్ అయ్యారు. తన భార్య, కూతురు, అన్నదమ్ములను ఏ అధికారి కలిసినా సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికలే తనకు ఛాలెంజ్ అన్నారు. ఎక్కువ సీట్లు గెలిచి కేంద్రంలో కాంగ్రెస్‌ను పవర్‌లోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలే పార్లమెంట్ ఎన్నికల అస్త్రాలని స్పష్టం చేశారు.