క్రికెట్ లెజెండ్ సచిన్ సెక్యూరిటీ గార్డు కాప్డే (39) ఆత్మహత్య చేసుకున్నాడు. స్వస్థలం మహారాష్ట్రలోని జామ్నెర్ పట్టణంలో తన తుపాకీతో మెడపై కాల్చుకున్నాడు. సెలవు తీసుకొని కొద్ది రోజులుగా స్వస్థలంలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF) జవాన్‌గా వీవీఐపీకి సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నాడు.