Homeబిజినెస్‌Salaries : 9.9% పెరగనున్న ఉద్యోగుల జీతాలు

Salaries : 9.9% పెరగనున్న ఉద్యోగుల జీతాలు

Salaries : 9.9% పెరగనున్న ఉద్యోగుల జీతాలు

Salaries : దేశీ కార్పొరేట్లు ఈ ఏడాది ఉద్యోగుల వేతనాల్ని 9.9 శాతం మేర పెంచగలమన్న ధీమాతో ఉన్నాయి.

ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉన్నందున 2022లో వేతనాల పెంపు గతేడాదికంటే అధికంగా ఉంటుందని కార్పొరేట్‌ సంస్థలు పేర్కొంటున్నాయి.

అంతర్జాతీయ వృత్తినిపుణుల సేవల సంస్థ అయాన్‌.. ఇండియాలో నిర్వహించిన వేతన పెంపు సర్వేను బుధవారం విడుదల చేసింది.

2021లో వేతనాల సగటు పెంపు 9.3 శాతంగా ఉందని, ప్రస్తుత ఏడాది ఈ పెంపు 9.9 శాతానికి పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న కార్పొరేట్‌ ప్రతినిధులు వెల్లడించారని అయాన్‌ తెలిపింది.

40కిపైగా పారిశ్రామిక రంగాలకు చెందిన 1,500 కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించి, ఈ అధ్యయనాన్ని తయారు చేశారు. వివరాలివి..

USA Power : అధికారం కోసం ట్రంప్ ఇంత ప‌ని చేశాడా

Zomoto Shares : ఇన్వెస్ట‌ర్ల‌ను నిండా ముంచుతున్న జొమోటో

  • ఈ-కామర్స్‌, వెంచర్‌ క్యాపిటల్‌, ఐటీ, ఐటీఈఎస్‌, ఫార్మా పరిశ్రమల్లో రెండంకెల్లో జీతాలు పెరిగే అవకాశం. సర్వేలో పాల్గొన్న 33 శాతం కంపెనీల మాట ఇది.
  • ఈ-కామర్స్‌లో 12.4%, హైటెక్‌ రంగంలో 11.6 శాతం, వెంచర్‌ క్యాపిటల్‌లో 10.9 శాతం, ఐటీఈఎస్‌లో 10.7% చొప్పున వేతనాల పెంపు ఉంటుందని అంచనా.
  • మెటల్‌, మైనింగ్‌ రంగంలో 8.3 శాతం, రెస్టారెంట్స్‌ రంగంలో 8.5 శాతం, సిమెంట్‌ పరిశ్రమలో 8.6 శాతం వేతనాల పెంపును అంచనా వేస్తున్నారు.
  • సర్వేలో పాల్గొన్న 46 శాతం కంపెనీలు 8-10 శాతం మధ్య వేతనాల పెంపు ఉంటుందని పేర్కొన్నాయి.
  • గతేడాది అప్రైజల్‌ సీజన్‌ సందర్భంగా నిర్వహించిన సర్వేలో రెండంకెల వేతనాల వృద్ధిని 27.5 శాతం కంపెనీలు అంచనా వేయగా, ఈ సీజన్లో 32.3 శాతం కంపెనీలు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
  • 8-10 శాతం వేతన వృద్ధిని అంచనా వేస్తున్న కంపెనీల శాతం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 38.6 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది.

Omicron Variant : షాకింగ్.. ఒమిక్రాన్‌కూ వేరియంట్లు

Jio 6G : త్వ‌ర‌లో భార‌త్‌లో జియో 6జీ సేవ‌లు

రెండు దశాబ్దాల గరిష్ఠానికి వలసల రేటు

కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగుల వలసల రేటు 2021లో రెండు దశాబ్దాల గరిష్ఠస్థాయికి చేరిందని అయాన్‌ సర్వే వెల్లడించింది.

గత 6-8 నెలలుగా నిపుణుల కోసం కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగా వలసల రేటు 21 శాతానికి పెరిగిందని, 2003 తర్వాత ఇదే గరిష్టమని సర్వేలో తేలింది. 2020లో వలసల రేటు 12.8 శాతంగా ఉంది.

Millets Food : చిన్నారుల‌కు ఎదుగుద‌ల‌కు చిరుదాన్యాలు

Google : అమ్మాయిలు గూగుల్ ఎక్కువ‌గా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..

Career : ఉద్యోగాలకు రాజీనామాలు.. కొత్త కెరీర్ వైపు చూపులు

Recent

- Advertisment -spot_img