ఇదేనిజం, నారాయణ్‌ఖేడ్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ నాయకులు చిరంజీవి మాట్లాడుతూ ..గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పారిశుధ్యం కోసం వినియోగించే వస్తువులు ఇవ్వాలని కోరారు. కార్మికులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్నారు. అవినీతికి పాల్పడే పంచాయతీ కార్యదర్శుల సస్పెండ్ చేయాలన్నారు.