Samantha celebrating for her fans increase : అభిమానుల ప్రేమకు సమంత సంబరం
సామాజిక మాధ్యమాల్లో సమంత(Samantha)కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.
సామాజిక మాధ్యమాల్లో తగ్గేదే లే అంటూ సమంత మరింత దూసుకుపోతోంది.
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు పెరిగిందని, తనపై ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొంది.
సమంతకు సాధారణంగానే సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ ఎక్కువ.
నాగచైతన్యతో ఆమె విడిపోయాక ఆ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది.
ఆమె పదే పదే వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి.
పుష్ప సినిమాలో ఐటం సాంగ్‌లోనూ డ్యాన్స్ చేసింది.
సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు చేరగా, రష్మిక మంధనా ఫాలోవర్ల సంఖ్య 2.4 కోట్లుగా ఉంది.
ఇక కాజల్ అగర్వాల్ కు 2.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Samantha
samantha