HomeసినిమాSamantha Instagram Post : నేను నీ దాన్ని.. నీవు నా వాడివి..

Samantha Instagram Post : నేను నీ దాన్ని.. నీవు నా వాడివి..

Samantha Instagram Post : నేను నీ దాన్ని.. నీవు నా వాడివి..

సమంత -నాగచైతన్య.. కొన్ని రోజుల క్రితం వరకు కూడా టాలీవుడ్‌లో మోస్ట్‌ లవ్లీ, రోమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

దాదాపు పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

2017 అక్టోబర్‌ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది.

అన్ని బాగుంటే.. ఈ రోజు (అక్టోబర్‌ 7)వీరు నాల్గో వివాహా వార్షికోత్సవం జరుపుకునేవారు.

కానీ కొన్ని రోజులు క్రితం చై-సామ్‌లు విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఏడాది క్రితం సమంత చేసిన ఓ ఇన్‌స్టా పోస్ట్‌ తాజాగా మరో సారి వైరలవుతోంది.

ఈ జంట కలిసి ఉంటే ఈ రోజు మ్యారేజ్‌ డే జరుపుకునేవారు.

ఈ క్రమంలో గతేడాది మ్యారేజ్‌ డే సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్య తో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేసి.. ”నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌” అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు.

తాజాగా ఈ పోస్ట్‌ మరోసారి వైరలవుతోంది.

ఇప్పటికి వీరు విడిపోవడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు..

”గతేడాది ఇదే సమయంలో మీ ఇద్దరి మధ్య హద్దుల్లేని ప్రేమ, అభిమానాలు.. ఇప్పుడు అంతంలేని దూరం.. ఎందుకిలా జరిగింది.. ఏడాదిలోపే ఇంత కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నారు..

మీరిద్దరు తిరిగి కలిసిపోతారని నేను గట్టిగా నమ్ముతున్నాను.. ఈ ఫోటో చూస్తే నాకు చాలా బాధగా ఉంది.. మీరు మా హృదయాలను ముక్కలు చేశారు” అంటూ నెటిజనులు బాధపడుతున్నారు.

ఇక చై-సామ్‌ ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి.

వాస్తవం వారిద్దరికి మాత్రమే తెలుసు. ఇప్పుడు వీరిద్దరు తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాలను ఎలా మలుపుతిప్పుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

https://www.instagram.com/p/CF_MKk0hj6P/?utm_source=ig_web_copy_link

Recent

- Advertisment -spot_img