Save desi cows:క్రాస్ బ్రీడింగ్ వల్ల దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ అల్లోల దివ్యారెడ్డి… ఎంపీ సంతోష్ కుమార్ ను కోరారు. మంగళవారం ప్రగతి భవన్ లో ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసి దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు. హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాలనే కర్తవ్యంతో సేవ్ దేశీ కౌస్ ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.
ఎంపీ సంతోష్ సహకారం కోరిన దివ్యారెడ్డి
పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సీడ్ గణేషా లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దేశవాళీ ఆవుల, పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా చేయూతను అందించాలని ఎంపీ సంతోష్ కుమార్ ను కోరారు. రోగ నిరోధక శక్తిలో, పాల నాణ్యతలో దేశీ ఆవులకు సాటిరాని హైబ్రీడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతులను అరికట్టిను దేశవాళీ ఆవుల పోషణ వృద్ధి చెందేలా మన రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మద్దతు ఉంటుంది :ఎంపీ సంతోష్
సామాజిక బాధ్యతగా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యా రెడ్డి చేస్తున్న కృషిని ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.