మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో పర్యటించిన మయిజ్జు ఈరోజు మేము చాలా చిన్నవాళ్లమే కానీ మమ్ముల్ని బెదిరించే హక్కు ఎవరికీ లేదు అని చైనాలో జరిగిన ఓ సమావేశంలో అన్నారు. ఇటీవల భారత్–మాల్దీవుల మధ్య జరిగిన వివాదం దృష్టిలో ఉంచుకొని.. కావాలనే భారత్ ను ఉద్దేశించి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చైనా అండా చూసుకొని మయిజ్జు రెచ్చిపోతున్నాడని పలువురు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.