తరుచూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసుకదా. తాజాగా ఓ అధ్యయనంలో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది.
మహిళలు తరుచూ సెక్స్‌లో పాల్గొనడం ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని ఆ అధ్యయనం వెల్లడించింది. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు సెక్స్‌లో పాల్గొనే మహిళలు ఈ సమస్యను అధిగమిస్తారని అందులో తెలిపింది.
సెక్స్ చేసే సమయంలో లవ్ మేకింగ్, ఉద్వేగానికి లోనైనప్పుడు విడుదలయ్యే రసాయనాలు ముఖ్యమైన కండరాల సంకోచాన్ని పెంచడం ద్వారా రాళ్లు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టర్కీలోని అవ్రాస్య యూనివర్సిటీ జరిపిన ఈ అధ్యయనం వివరాలను.. జర్నల్ ఇంటర్నేషనల్ యూరాలజీ అండ్ నెప్రాలజీలో పబ్లిష్ చేశారు.
ఈ అధ్యయనంలో భాగంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న మొత్తం 70 మంది మహిళలను ఎంచుకున్నారు.
అందులో సగం మంది తాము వారానికి మూడు నుంచి నాలుగు సార్లు సెక్స్‌లో పాల్గొంటామని చెప్పారు. మిగతా వారు ఆ కేటగిరిలో లేనట్టు తెలిపారు.
రెండు వారాల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించగా.. తరుచూ సెక్స్‌లో పాల్గొనేవారిలో 80 శాతం మందికి కిడ్నీలో రాళ్లు మూత్రం ద్వారా బయటకు వచ్చినట్టు గుర్తించారు.
అలాగే తరుచూ సెక్స్‌లో పాల్గొనని వారిలో కేవలం 51 శాతం మంది మాత్రమే ఆ సమస్య నుంచి బయట పడగలిగారు.