Shivathmika Rajashekar : ఓటీటీలో రాజశేఖర్ కూతురు సినిమా
Shivathmika Rajashekar – యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కూతురు శివాని నటిస్తోన్న తాజా చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు).
అదిత్ అరుణ్ మేల్ లీడ్ రోల్ చేస్తున్నాడు.
కె.వి.గుహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని చిత్రం రవిప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫాంలో సందడి చేయనుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనిలివ్’లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు విడుదల కానుంది.
ఈ మూవీకి సైమన్ కె.కింగ్ మ్యూజిక్ డైరెక్టర్.
తెలుగులో తొలిసారి వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ సినిమా ఇదని రవిప్రసాద్ రాజు అన్నారు.
ఈ ప్రాజెక్టు సోనీలివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం.
కేవీ గుహన్ మేకింగ్, అదిత్ అరుణ్ – శివానిల కెమిస్ట్రీ క్లాస్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.
ఈ సినిమాకి ఎడిటింగ్: తమ్మిరాజు, మాటలు: మిర్చి కిరణ్. సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్.