మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సోమవారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికతో గుఫ్రాన్ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. కొంత కాలంగా ఆమె మరో అబ్బాయితో చనువుగా ఉంటోంది. దీనిని గుఫ్రాన్ తట్టుకోలేకపోయాడు. నగరంలోని క్లాక్ టవర్ వద్ద కారు ఆగిన వెంటనే గుఫ్రాన్ అక్కడకు వెళ్లాడు. కారులోని బాలికను కత్తితో గొంతు కోసి పారిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది.