అమెరికాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఖమ్మం జిల్లా యువకుడు నూకారపు సాయి తేజ మృతి చెందాడు. చికాగోలోని ఎన్-ఫేర్వెల్ ఈవ్ లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సాయి తేజ మరణించాడు. సాయి తేజ 4 నెలల క్రితమే ఎమ్మెస్సీ చదవడానికి అమెరికా వెళ్లాడు. చదువుకుంటూ చికాగోలోని ఓ సూపర్ మార్కెట్ లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.