Joint Pains : జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులకు ఈ మూలికలతో చెక్
Joint Pains : ఆధునిక జీవితంలో మోకాలి నొప్పులు, భుజం నొప్పులు సర్వ సాధారణంగా మారాయి.
పాదాలు, కాళ్ల నుంచి చేతులు, భుజం వరకూ జాయింట్ పెయిన్స్ సమస్య ఎక్కువవుతోంది.
ఈ నేపధ్యంలో ప్రకృతి సిద్ధమైన ఆరు సహజ మూలికలతో ఈ నొప్పుల్నించి విముక్తి పొందవచ్చు.
అవేంటో తెలుసుకుందాం.
జాయింట్ పెయిన్స్ (Joint Pains) అనేది శరీరంలోని ఏ జాయింట్‌లో అయినా వస్తుంది.
జాయింట్ పెయిన్‌కు క్లినికల్ పదం అర్థరాల్జియా. రెండు ఎముకలు కలిసే చోట లేదా ఆ రెండు ఎముకల కదలిక స్థానంలో భరించలేని నొప్పి ఉంటుంది.
రెండు ఎముకలు కలిసే చోట కదిలేందుకు వీలుగా కార్టిలేజ్ ఉంటుంది.
Cancer To Hamsa Nandini: వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా
Micro plastics in Drinking Water : మీరు తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్..
ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ భాగంలో నొప్పి ఎక్కువవుతుంది.
జాయింట్ ఇన్‌ఫ్లమేషన్ నొప్పికి దారి తీస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
జాయింట్ పెయిన్ అనేది ఒక్కోసారి నెమ్మదిగా ప్రారంభమై..తీవ్రమౌతుంది. ఒక్కోసారి దానికదే పోతుంది కూడా.
క్రానిక్ పెయిన్‌గా మారితే మాత్రం మూడు నెలల వరకూ ఉంటుంది.
దాంతో డాక్టర్ల చుట్టూ తిరగడం, దీర్ఘకాలంగా మందులు వాడటం వంటివి ఎదురౌతాయి.
అయితే ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే ఆయుర్వేద మూలికలతో (Natural Herbs) ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేద వైద్య విధానంలో జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులకు చాలా సులభంగా నియంత్రించవచ్చంటున్నారు.
Winter Healthy Soup : చలికాలంలో ఈ సూప్ చాలా మంచి చేస్తుంది..
Fish Head Benefits : చేప తల ముక్కలు తినే వారికే ఓ లెవల్ ప్రయెజనాలు
సర్జరీలు, ఇతర మందుల ద్వారా చాలా రకాల దుష్పరిణామాలు ఎదురవుతాయి.
అదే ఆయుర్వేద వైద్యవిధానంలో ఆ సమస్య ఉండదంటున్నారు.
ఈ ఆయుర్వేద మందులు దీర్ఘకాలికంగా ఈ సమసల్ని నయం చేస్తాయి.
అశ్వగంధ (Aswagandha)
ఆయుర్వేద వైద్య విధానంలో (Ayurveda Medicine) ఆశ్వగంధకు చాలా ప్రముఖ స్థానముంది.
ఇది పెయిన్ కిల్లర్‌గా, సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ నియంత్రించే ఇన్‌ఫ్లమేటరీ గుణాల్ని నియంత్రిస్తుంది.
చాలా రకాల జాయింట్ పెయిన్స్‌కు అశ్వగంధ మంచి మందుగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
Always Be Young : ఎప్పుడూ యవ్వనంగా ఉండండిలా…
Curd Side Effects: కొందరు పెరుగు అస్సలు తినకూడదు.. మీరు తినొచ్చా
ఆర్ధరైటిస్ మెరుగుపర్చడంలో, నెర్వస్‌నెస్ తగ్గించడంలో అశ్వగంధ చాలా బాగా ఉపయోపడుతుంది.
గుగ్గుల్ (Guggul)
గుగ్గుల్ అనేది అద్భుతమైన పెయిన్ రిలీవర్‌గా పని చేస్తుంది.
చర్మ సంబంధిత నొప్పుల్నించి కూడా విముక్తి ప్రసాదిస్తుంది.
ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఉన్నాయి.
షిలాజిత్ (Shilajit)
షిలాజిత్ అనేది మరో అద్భుతమైన వనమూలిక. హిమాలయ పర్వత శ్రేణుల్లో తొలిసారిగా వెలుగు చూసింది.
వందలాది సంవత్సరాల్నించి షిలాజిత్ ప్లాంటేషన్ జరుగుతోంది.
No to Onion : పూజలున్నప్పుడు వంటల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు వాడరు
Check BP : వ్యాయామానికి ముందు, తర్వాత బీపీ చెక్ చేసుకోవాలని తెలుసా
అద్భుతమైన ఆంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన షిలాజిత్‌ను పెయిన్ కిల్లర్‌గా ఉపయోగిస్తున్నారు.
ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్ధరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర రుగ్మతల్లో మంచి ఫలితాలనిస్తుంది.
సురంజన్ (Suranjan)
సురంజన్ వనమూలికలో ఉన్న యాంటీ ఆర్ధరైటిక్ యాక్టివిటీ చికిత్సలో చాలా దోహదపడుతుంది.
ఇది కూడా రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌లో ఉపయోగపడుతుంది.
ఇది నొప్పిని తగ్గించడంలో రుమాటిజమ్‌ను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది.
మరోవైపు సెక్సువల్ సామర్ధ్యం పెంచడంలో దోహదపడుతుంది.
టర్మరిక్ (Turmeric)
ఇక పసుపు సుదీర్ఘకాలంగా , వందలాది ఏళ్లుగా అద్బుతమైన మెడిసిన్‌గా వాడుకలో ఉంది.
Healthy Juice : రాత్రి పడుకునే ముందు ఈ జ్యూస్ తాగితే రోగాలన్నీ దూరం
Pain Killer : ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి నొప్పి నుంచి అయినా రిలీఫ్
జాయింట్ ఇన్‌ఫ్లమేషన్, ఆర్ధరైటిస్ చికిత్సలో పసుపు వాడుతుంటారు.
ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలతో నొప్పి వెంటనే నయమవుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో పసుపుని మించింది లేదు.
గ్లూకోసమిన్ మరియు కోండ్రోయిటిన్ (Glucosamine and Chondroitin)
జాయింట్స్ వద్ద ఉండే కార్టిలేజ్‌లో గ్లూకోజమిన్, కోండ్రోయిటిన్‌లు అంతర్భాగమై ఉంటాయి.
ఇవి శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. ఇవి లోపిస్తేనే వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి.
జాయింట్స్‌లో ఉండే లిగమెంట్ డిసింటిగ్రేషన్‌ను ఇవి దూరం చేస్తాయి.