ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్ : వాంకిడి మండలం లో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ చెప్పారు. సర్కేపల్లి అడవుల్లో వన్య ప్రాణుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్ పీట్లను పరిశీలించారు. వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వన్య ప్రాణులకు నీటి ఎద్దడి తలెత్తకుండా సాసర్ పీట్ల నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. అడవుల సంరక్షణలో భాగంగా ఫైర్ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశువుల కాపర్లు, అటవి తీర ప్రాంతాల ప్రజలు బీడీలు కాల్చి అడవుల్లో పడేయకూడదని సూచించారు. ప్రతి ఒక్కరు అటవీ సంరక్షణను బాధ్యతగా తీసుకుని సహకరించాలని కోరారు. అసిఫాబాద్ ఎస్‌ఆర్ఓ అప్పులకొండ, ఎఫ్ఎస్ఓ లక్ష్మణ్, బీట్ అధికారులు పాల్గొన్నారు.