Summer Drinks : దాహం వేస్తే కూల్‌డ్రింకులు తాగుతున్నారా
Summer Drinks : దాహం వేసినపుడు కొందరు నీళ్లకు బదులు కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, కాఫీ, టీ వంటివి తాగేస్తుంటారు.
వీటితో అప్పటికి దాహం తీరొచ్చేమో గానీ చాలా దుష్ప్రభావాలు పొంచి ఉంటాయి.
చక్కెరను కలిపి తయారుచేస్తారు కాబట్టి ఇవి బరువు పెరగటానికివి దోహదం చేస్తాయి.
అందుకే దాహం వేసినపుడు మామూలు నీళ్లు తాగటమే మంచిదన్నది నిపుణుల సూచన.
ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న కొందరి ఆహార అలవాట్లను పరిశోధకులు ఇటీవల విశ్లేషించారు.
వీరంతా సగటున రోజుకు 4.2 కప్పుల నీళ్లు, 2,157 కేలరీలను తీసుకుంటున్నట్టు గుర్తించారు.
అయితే నీళ్లు ఎక్కువగా తాగినవారు మాత్రం కేలరీలు, తీపి పానీయాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకోవటం గమనార్హం.
రోజుకు 1-3 కప్పులు ఎక్కువగా నీళ్లు తాగినా 68 నుంచి 205 వరకు కేలరీలు తగ్గుతున్నట్టు బయట పడింది.
అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు తగినన్ని నీళ్లు తాగాలని, వీలైతే కాస్త ఎక్కువగా తీసుకోవటమూ మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.
అందువల్ల ఈసారి దాహం వేసినపుడు శీతల పానీయల జోలికి వెళ్లకుండా మామూలు నీళ్లే తాగండి. దీంతో దాహం తీరటంతో పాటు బరువూ అదుపులో ఉంటుంది.
Morning Food : ఉదయాన్నే వీటిని తింటే రోజంతా ఉత్సాహం
Kidney Stones : టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయా ?
ఇక దాహం వేస్తే గానీ నీళ్ల గురించి ఆలోచించం. నిజానికి దాహం వేయటానికి ముందుగానే.. మన ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది.
పరిస్థితి ఇంతవరకు రాకుండా తరచుగా నీళ్లు తాగటం మంచిది.
కానీ మనలో చాలామంది.. తగినంత నీరు తాగరు. మన ఒంట్లో ప్రతి వ్యవస్థా సక్రమంగా పనిచేయటానికి నీరు ఎంతగానో తోడ్పడుతుంది.
ఇది కణాలన్నింటికీ పోషకాలు, ఆక్సిజన్‌ను చేరవేయటం దగ్గర్నుంచి.. మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు వెళ్లగొట్టటం వరకు రకరకాల పనులు చేస్తుంది.
తిన్న ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకాన్ని దరిజేరనీయదు.
రక్తపోటును, గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. అవయవాలను, కణజాలాలను రక్షిస్తూ.. కీళ్లు ఒరుసుపోకుండా చూస్తుంది.
ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ.. సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంది.
ఇంత కీలకమైంది కాబట్టే నీటి శాతం తగ్గితే బలహీనత, రక్తపోటు పడిపోవటం, తికమక, తలతిప్పు వంటి లక్షణాలు బయలుదేరతాయి.
కాబట్టి రోజుకు సుమారు 2 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. ఇది కూడా ఆయా వ్యక్తులను బట్టి మారుతుంది.
కొన్ని జబ్బులు గలవారు మరింత ఎక్కువగా తాగాల్సిన అవసరం ఉండొచ్చు.
అలాగే వ్యాయామం, శారీరక శ్రమ చేసేవారు చెమట రూపంలో బయటకు వెళ్లే నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి.
మొత్తమ్మీద మూత్రం ముదురు రంగులో రాకుండా చూసుకుంటే తగినంత నీరు తాగుతున్నట్టే.
Egg Quality test : గుడ్డు తాజాదనాన్నికనిపెట్టేందుకు సింపుల్ ట్రిక్స్..