Swift on Russia : రష్యాపై ‘స్విఫ్ట్’ అస్త్రం..? నష్టం ఏంటి?
Swift on Russia : ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా, ఈయూకు ‘స్విఫ్ట్’ ఒక పదునైన ఆయుధంలా కనిపిస్తోంది.
అసలు ‘స్విఫ్ట్’ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? ప్రపంచ విపణిలో దాని ఆవశ్యకత ఏంటి? ఇప్పుడు చూద్దాం..
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా, బ్రిటన్, ఐరోపా సమాజం(ఈయూ)లోని దేశాలు మంతనాలు జరుపుతున్నాయి.
ఇప్పటికే పలు ఆంక్షలను విధించాయి.
అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది కనుక ఈ లోపే రష్యాను ఆర్థికంగా నష్టపరిచి శిక్షించాలని యోచిస్తున్న వారికి ‘స్విఫ్ట్’ ఒక పదునైన ఆయుధంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అసలు ‘స్విఫ్ట్’ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? ప్రపంచ విపణిలో దాని ఆవశ్యకత చర్చనీయాంశంగా మారింది.
Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు పడకుండా డబ్బు డ్రా చేయడం ఎలా..?
Insurance : ఈ వయసులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..
‘స్విఫ్ట్’ అంటే..
ప్రపంచవ్యాప్త బ్యాంకుల ఆర్థిక సమాచార సంఘం (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్)కు సంక్షిప్త రూపమే స్విఫ్ట్ (ఎస్.డబ్ల్యూ.ఐ.ఎఫ్.టి.).
బెల్జియం ప్రధాన కేంద్రంగా పనిచేసే కన్సార్షియం ఇది.
అంతర్జాతీయంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య కీలకమైన సమాచారాన్ని, సందేశాలను వేగంగా, సురక్షితంగా చేరవేస్తుంది.
వీటిద్వారా స్విఫ్ట్ వ్యవస్థతో అనుసంధానమైన బ్యాంకులు తమ మధ్య భారీ చెల్లింపులను నిస్సందేహంగా జరుపుకొంటాయి.
నిర్వాహకులు ఎవరు?
‘స్విఫ్ట్’ వ్యవస్థ 1970లో రూపుదాల్చింది. కొన్ని వేల సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.
సభ్యులకు సేవలు అందించడమే దీని లక్ష్యం. సహకార విధానంలో కొనసాగుతోంది.
స్విఫ్ట్ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం సగటున రోజుకు 4.20కోట్ల సందేశాలు వెళ్తున్నాయి.
2020లో ఈ రోజువారీ సగటు 3.80కోట్లు.
అత్యంత విశ్వసనీయ వ్యవస్థ కనుకే నిత్యం రూ.లక్షల కోట్ల విలువైన లావాదేవీలకు ఇది కేంద్ర బిందువుగా మారింది.
Instant Loan : ఇన్స్టంట్ లోన్ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే
Egg Quality test : గుడ్డు తాజాదనాన్నికనిపెట్టేందుకు సింపుల్ ట్రిక్స్..
భిన్నాభిప్రాయాలు ఎందుకంటే..
స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను తొలగించాలని ఉక్రెయిన్, బ్రిటన్‌లు కోరుతున్నాయి.
అయితే, ఈయూలోని పలు దేశాలు సహనం పాటించాలని సూచిస్తున్నాయి.
రష్యాపై విధించే నిషేధం అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడులకు గురవుతాయని డచ్ ప్రధాన మంత్రి మార్క్ రూత్ అన్నారు.
రష్యాను స్విఫ్ట్ నుంచి తక్షణమే బహిష్కరించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జీ7 దేశాల సమావేశంలో ఒత్తిడి తెచ్చారు.
అయితే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అందుకు సుముఖంగా లేరు.
స్విఫ్ట్ నుంచి బహిష్కరణ చివరి అస్త్రంగానే ఉండాలన్నారు.
నిషేధ ప్రభావం ఎంత?
స్విఫ్ట్ నిషేధం ద్వారా ఆర్థిక సేవల సమాచారం పొందకుండా చేయగలమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం చేయలేమని ఒబామా ప్రభుత్వంలో సేవలందించిన న్యాయవాది స్మిత్ తెలిపారు.
దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.
అమెరికా డాలర్ స్థానంలో ప్రత్యామ్నాయ కరెన్సీ ఆధారంగా ప్రత్యర్థులు సమాచార వ్యవస్థను రూపొందించుకుంటారని హెచ్చరించారు.
ఇవి ట్రై చేస్తే థైరాయిడ్ సమస్య రాదు
స్విఫ్ట్ తటస్థమేనా!
గతంలో కొన్ని దేశాలపై నిషేధం విధించేందుకు స్విఫ్ట్ తిరస్కరించింది.
తటస్థమైన వ్యవస్థగా తనను అభివర్ణించుకుంది.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆర్థిక సంస్థలతో తెగతెంపులు చేసుకొనే నిర్ణయాన్ని తీసుకోబోమని స్పష్టం చేసింది.
నిషేధం ఎలా పనిచేస్తుంది?
రష్యా బ్యాంకులను స్విఫ్ట్ నిషేధిస్తే…అవి ప్రపంచ మార్కెట్లతో అనుసంధానాన్ని కోల్పోతాయి.
రష్యన్లు, వారి కంపెనీలు దిగుమతులకు నగదు చెల్లింపులను సకాలంలో చేయలేవు.
ఎగుమతులకు రావాల్సిన సొమ్మును అందుకోలేవు. రుణాలను పొందలేవు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టలేవు.
అప్పుడు రష్యా బ్యాంకులు తమ చెల్లింపుల కోసం ఫోన్లపై, లఘుసందేశాల యాప్‌లపై, ఈమెయిల్స్ వంటి ప్రత్యామ్నాయాలపై ఆధారపడక తప్పదు.
తమపై ఆంక్షలు విధించని దేశాలతో ఈ విధానాల్లోనే లావాదేవీలు కొనసాగించాల్సి వస్తుంది. నిర్వహణ వ్యయం అధికమవుతుంది.
కిడ్నీలను ఇలా శుభ్రం చేసుకోండి..
Salaries : 9.9% పెరగనున్న ఉద్యోగుల జీతాలు
ఆంక్షలను అమలు చేయగలదా?
బెల్జియం, ఈయూ నిబంధనలకు లోబడి స్విఫ్ట్ పనిచేస్తుంది.
ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో 2012లో ఆ దేశానికి చెందిన సంస్థలు, కేంద్ర బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు స్విఫ్ట్ సేవల్ని వినియోగించుకోకుండా ఈయూ దేశాలు నిషేధం విధించాయి.
ఇతర దేశాలపైనా ప్రభావం…
స్విఫ్ట్ సేవల నుంచి రష్యా బ్యాంకులను దూరంగా పెట్టినట్లయితే ఆ దేశానికి సరకులను ఎగుమతి చేసే వారు తమకు రావాల్సిన నగదును పొందటానికి కష్టపడాల్సి వస్తుంది.
రష్యా ప్రధాన ఎగుమతులైన చమురు, సహజవాయువులను పొందే దేశాలకూ ఇబ్బందులు తప్పవు.
Reservations in Private Sector : ప్రైవేటు సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్..
Deepika Padukone : మా నాన్న జీవితాన్ని సినిమా తీస్తా..
CAT warning : అతన్ని తీసుకుంటారా? మిమ్మల్ని పంపించాలా? సీఎస్‌కు క్యాట్ హెచ్చరిక