టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ఈనెల 9 న జరగనుంది. ఈ గేమ్ గురించి క్రీడాలోకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. కేవలం ఇండియా, పాకిస్తాన్ మాత్రమే గాక ప్రపంచంలోని చాలా దేశాలు ఈ పోరు కోసం ఎంతో ఆసక్తి, ఉత్కంఠతో ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ టీం కెప్టెన్ బాబర్ అజమ్ ఈ మ్యాచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఇండియాతో మ్యాచ్ అంటే మాపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని మేం అధిగమించాలి. ప్రశాంతంగా ఆడాలి. 2021 లో ఇండియాపై గెలిచాం. మళ్లీ అదే రిపీట్ చేస్తామన్న నమ్మకం మాకు ఉంది. 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ దాకా వెళ్లినా ఆఫ్రీది గాయం కారణంగా ఓడిపోయాం’ అని అన్నాడు. కాగా ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు ఎనిమిది సార్లు తలపడగా ఇండియా 8 మ్యాచుల్లో నెగ్గింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో మొత్తం 6 సార్లు తలపడగా ఇండియా 4 సార్లు గెలిచింది. పాకిస్తాన్ 1 మ్యాచ్ గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది.