Homeహైదరాబాద్latest NewsT20 World Cup 2024: ఒకే మ్యాచ్ ఐదు రికార్డులు బ్రేక్.. కోహ్లి, ధోని రికార్డులను...

T20 World Cup 2024: ఒకే మ్యాచ్ ఐదు రికార్డులు బ్రేక్.. కోహ్లి, ధోని రికార్డులను తునాతునకలు చేసిన రోహిత్ శర్మ..!

టీ20 వరల్డ్ కప్ 2024(T20 World Cup 2024) లో నిన్న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు అదిరే ఆరంభం దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మన బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్య (3/27), బుమ్రా (2/6), అర్షదీప్ సింగ్ (2/35) సత్తాచాటారు. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు. రిషబ్ పంత్ 26 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్‌కు అనుకూలించని పిచ్‌పై హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. సారథిగా, హిట్టర్‌‌గా చరిత్ర సృష్టించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు బాదిన ఏకైక ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టీ20ల్లో 193 సిక్సర్లతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు హిట్ మ్యాన్. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. టీ20ల్లో టాప్ స్కోరర్లుగా విరాట్ కోహ్లీ (4038), రోహిత్ (4026), బాబర్ ఆజం (4023) ఉన్నారు. అదే విధంగా టీ20ల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన ఆటగాడిగా హిట్‌మన్ నిలిచాడు. 2860 బంతుల్లో ఈ మార్క్‌ను అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ (2900 బంతులు) పేరిట ఉండేది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఛేజింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐర్లాండ్‌పై గెలిచిన కెప్టెన్‌ రోహిత్‌కి ఇది 43వ విజయం. ఈ విజయంతో భారత్ తరఫున అత్యధిక టీ20లు గెలిచిన ఎంఎస్ ధోని (43)తో జతకట్టాడు. ధోనీ-రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ (32) ఉన్నారు.

Recent

- Advertisment -spot_img