జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దక్షిణాఫ్రికా 15 మందితో కూడిన జట్టును ఈ రోజు ప్రకటించింది. దక్షిణాఫ్రికా జట్టులో పెద్దగా సంచలనాలకు ఆస్కారం లేదు. 2022 టీ20 ప్రపంచ కప్ ఆడిన వారే దాదాపుగా ఈ వరల్డ్ కప్ ఆడనున్నారు. దక్షిణాఫ్రికాకు మార్‌క్రమ్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టును వెల్లడించారు. ర్యాన్ రికెల్టన్, బార్ట్‌మన్ వంటి కొత్త ఆటగాళ్లకు తొలిసారి చోటు దక్కింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి మినహాయించబడిన అన్రిచ్ నోకియా, క్వింటన్ డి కాక్ 15 మంది ప్రాబబుల్స్ లో ఉన్నారు. రిజర్వ్ ప్లేయర్లుగా బర్గర్, లుంగీ ఎంగిడిలను సెలక్ట్ చేసింది.
దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జ్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ ట్రిస్టన్ స్టబ్స్.
ట్రావెల్ రిజర్వ్: నాంద్రే బర్గర్, లుంగి ఎన్గిడి.