T20 World Cup: వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ మరో కప్ వేటకు సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌ను అందుకోవడానికి టీమిండియా ప్రణాళికలు రచిస్తోంది. గ్రూప్-ఏలో ఉన్న రోహిత్ సేన సూపర్-8కు చేరుకోవడం సులభమే. ఆ తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించడానికి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్లుగా కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాన్స్ వేస్తున్నారు.
అయితే USAలో క్రికెట్ ఆడతామని తామెప్పుడూ ఊహించలేదని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నారు. ఇది క్రికెట్‌లో ఒక శుభపరిణామంగా అభివర్ణించారు. ‘‘క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయనడానికి ఇదొక నిదర్శనం. అమెరికా మార్పును స్వీకరించి వరల్డ్‌కప్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ దేశానికి బలమైన జట్టు కూడా సిద్ధం కావడం సంతోషకరం’’ అని కోహ్లీ పేర్కొన్నారు.