మరో మూడు రోజుల్లో వెస్టిండీస్-అమెరికా వేదికగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో ‘హైవోల్టేజ్ మ్యాచ్’గా భావిస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు భీకర ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. T20 వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్ 9న ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈమ్యాచ్‌కు ఉగ్రముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఐసిస్’ అండతో రెచ్చిపోతున్న ఓ ఉగ్ర ముఠా ‘మీరు మ్యాచ్‌ల కోసం వేచి చూస్తున్నారు. మేము మీకోసమే ఎదురుచూస్తున్నాం’ అని ఓ వ్యక్తి ఆయుధాలు ధరించి ఉన్న ఫొటోను షేర్ చేసింది. అదే ఫొటోలో ‘నసావు స్టేడియం..09/06/2024’ అని కూడా ఉండటం ఆందోళనకు దారితీసింది. జూన్ 9న ఇదే స్టేడియంలో రోహిత్ సేన..పాక్‌తో తలపడనుంది.