Homeహైదరాబాద్latest NewsTapsee : అతడే నా ప్రియుడు

Tapsee : అతడే నా ప్రియుడు

తెలుగు సినీ ప్రేక్షకులకు తొందరగా దగ్గరైన హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్​లో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ.. బాలీవుడ్​లోనూ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి టాలెంటెడ్ ఆర్టిస్ట్​గా పేరు తెచ్చుకుంది.

ALSO READ: ఆడవారికి బిగ్ షాక్.. ఇక ఫ్రీ బస్సు ప్రయాణం కష్టమేనా..

అయితే తాప్సీ డెన్మార్క్​ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ బోతో ప్రేమలో ఉన్నట్లు పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలసిందే. కానీ తాప్సీ మాత్రం ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమయాణం గురించి బయటపెట్టింది. మాథిస్ బోతో తాను దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్నానని తెలిపింది.

ALSO READ: రూ.400తో సింపుల్ గా డైరెక్ట్ అయోధ్యకు వెళ్లండి.. ఇలా..

సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్​లోకి అడుగుపెట్టే సమయంలో అతనితో పరిచయం ఏర్పడిందని, ఇన్నేళ్లుగా తమ బంధం బలపడుతూ వచ్చిందని తాప్సీ పేర్కొంది. అతనికి బ్రేకప్ చెప్పి మరో బంధంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా తనకు ఎప్పుడూ రాలేదని చెప్పింది. ప్రేమ, పెళ్లి గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని, అందుకే తమ ప్రేమ గురించి ఇప్పటి వరకు తాను ఎక్కడా మాట్లాడలేదని వెల్లడించింది. మాథిస్ వల్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని పేర్కొంది.

ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

Recent

- Advertisment -spot_img