It has been six years since the release of the Hindi film ‘Baby’ starring Taapsee on Saturday (January 23).
Directed by Neeraj Pandey, the film stars Taapsee in a role of just seven minutes in length. But she had a good stack.
‘‘సినిమాలో మీ పాత్ర నిడివి ఎంత అనేది ఆలోచించొద్దు. ఆ పాత్ర ఎంత ప్రభావితం చేస్తుందో మాత్రమే ఆలోచించండి’’ అని కొత్త హీరోయిన్లకు ఓ సలహా ఇచ్చారు తాప్సీ.
ఈ బ్యూటీ ఇలా అనడానికి ఓ కారణం ఉంది. ఆమె నటించిన హిందీ చిత్రం ‘బేబీ’ విడుదలై శనివారం (జనవరి 23)తో ఆరేళ్లయింది.
నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తాప్సీ పాత్ర నిడివి కేవలం ఏడు నిమిషాలే. కానీ ఆమెకు మంచి పేరొచ్చింది.
ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘ఏ ఆర్టిస్ట్ అయినా స్క్రీన్ మీద కనిపించే నిమిషాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే చాలు.
అది తక్కువసేపే అయినా కెరీర్‌కి మంచి మలుపు అవుతుంది. ‘బేబీ’ విషయంలో అదే జరిగింది.
ఈ సినిమాలో నేను చేసిన 7 నిమిషాల షబానా ఖాన్ పాత్ర నా కెరీర్‌కి మంచి మలుపు అయింది’’ అన్నారు.
ఈ సినిమాలో హీరోగా చేసిన అక్షయ్ కుమార్ ‘‘నువ్వు చెప్పింది కరెక్ట్. నిన్ను, నీ కెరీర్ సాగుతున్న విధానాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని తాప్సీని ఉద్దేశించి అన్నారు.
‘బేబీ’ తర్వాత తాప్సీ బాలీవుడ్‌లో ‘పింక్’ సినిమాలో నటించారు. ఆరేళ్లుగా హిందీలో బిజీ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు.