ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సీ ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది.
దీంతో కోలీవుడ్‌లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా నిరాశే ఎదురు కావడంతో బాలీవుడ్ చెక్కేసింది.
ఇప్పుడు అక్కడ బిజీ హీరోయిన్స్‌లో ఒకరిగా మారింది. ఎక్కువగా మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది తాప్సీ.
అయితే ఈ అమ్మడు డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది.
త్వరలోనే మాథ్యూస్, తాప్సీ వివాహం జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాప్సీ స్పందించింది.
చిత్ర పరిశ్రమకు చెందిన వారిని నా భర్తగా స్వీకరించాలని అనుకోలేదు. రాణించే వృత్తి, వ్యక్తిగత జీవితం వేరువేరుగా ఉండాలి.
మాథ్యూస్ నాకు బాగా తెలిసిన వ్యక్తి. ప్రస్తుతం యేడాదికి ఆరు చిత్రాల్లో నటిస్తున్నాను.
ఈ సంఖ్య రెండు లేదా మూడుకు తగ్గినప్పుడు పెళ్ళి చేసుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది.