Taapsee Pannu Reacted on High court judgement : హీరోయిన్ తాప్సీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
సమాజంలో జరిగే సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.
తాజాగా ఓ రేప్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై తాప్సీ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేసింది.
ఈ తీర్పుపై తాప్సీతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అత్యాచారం కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్డు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అయ్యింది.
‘అంతే.. ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది మాత్రమే మిగిలింది’ అంటూ తాప్సీ అసహనం వ్యక్తం చేశారు.
చట్టబద్ద వివాహంలో భార్యతో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది.
వైవాహిక అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్ధోషిగా ప్రకటించింది.
అదే సమయంలో భార్యతో అతడు జరిపిన అసహజ శృంగార చర్యలను నేరంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది.
దీనిపై ఇక గాయని సోనా మొహపాత్ర కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
‘ఇది చదివిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.