Homeహైదరాబాద్latest Newsసీక్రెట్​గా తాప్సీ పెళ్లి : Viral News

సీక్రెట్​గా తాప్సీ పెళ్లి : Viral News

నటి తాప్సీ పన్ను(Tapsee Pannu) సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్​, బాలీవుడ్​ లో ఆమె ఎన్నో సక్సెస్​ ఫుల్​ చిత్రాల్లో నటించారు. ఎప్పటికప్పుడు తన మనసులోని మాటను సైతం కుండబద్ధలు కొట్టినట్టు బయటకు చెబుతూ ఉంటుంది. తాజాగా ఈ పంజాబీ భామ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్‌ బాయ్‌ఫ్రెండ్‌, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు మాథియాస్‌ బో ను రహస్యంగా పెళ్లాడినట్లు నేషనల్​ మీడియాలో న్యూస్​ చక్కర్లు కొడుతోంది. మార్చి 23న ఉదయ్‌పూర్‌లో ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటైనట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మార్చి 20న ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే వీరి వివాహానికి హాజరైనట్లు సమాచారం. త్వరలో ముంబైలో తమ స్నేహితులకు గ్రాండ్‌గా పార్టీ ఇవ్వనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై తాప్సీ పన్ను క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img