Homeహైదరాబాద్latest Newsఓదెల 2 లో శివశక్తిగా తమన్నా

ఓదెల 2 లో శివశక్తిగా తమన్నా

ఓదెల 2 మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ మధు క్రియేషన్స్ తెలిపింది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా శివశక్తిగా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తమన్నా పరిచయాన్ని వివరించేలా ఓ వీడియోను రిలీజ్ చేశారు. 1.15 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో తమన్నా డిఫరెంట్ లుక్‌తో విభిన్న పాత్రలో కనిపించింది. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు.  కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Recent

- Advertisment -spot_img