Tamannah : తమన్నా ఖాతాలో క్రేజీ రికార్డ్..
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ మిల్కీ బ్యూటీ తమన్నా( Tamannaah ) చక్కగా పాటిస్తుంది.
వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఈ ముద్దుగుమ్మ వదులుకోవడం లేదు.ఒకవైపు టీవీ షోస్, మరోవైపు వెబ్ సిరీస్, ఇంకో వైపు సినిమలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.
ఐటెం సాంగ్ ఆఫర్స్ వచ్చినా కూడా తమన్నా వదలట్లేదు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని అందుకుంది.
ఈ ఆఫర్ తర్వాత తమన్నా(Tamannaah) మెగా ఫ్యామిలీ టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ గా ట్రెండ్ సెట్ చేసింది.
ఇప్పటికే తమన్నా .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గంగతో రాంబాబు సినిమా చేసి తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపించింది.. ఇక రామ్ చరణ్‌తో కలిసి రచ్చ సినిమాలో తెగ రచ్చ చేసింది.
ఇందులో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.
ముఖ్యంగా వాన వాన రీమేక్ సాంగ్ లో రామ్ చరణ్, తమన్నాలు చాలా ఈజ్‌తో డ్యాన్స్‌చేసి అదరగొట్టారు.
మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరో హీరో బన్నీతో కూడా తమన్నా స్క్రీన్ షేర్ చేసుకుంది.
వినాయక్ డైరెక్షన్లో వచ్చిన బద్రీనాధ్ మూవీలో అల్లు అర్జున్ కి జంటగా నటించి మెప్పించింది ఈ మిల్కీ బ్యూటీ.
ఇక వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 చిత్రంలోను తమన్నా నటించింది కాని, అందులో వెంకీ సరసన కథానాయికగా నటించింది.
మొత్తానికి మెగా హీరోలందరిని చుట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మ క్రేజీ రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకుంది.